Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:21 PM

టికెట్ నంబర్ ఒకటి.. బస్సు నంబర్ మరోటి.. జహీరాబాద్‌లో కర్ణాటక బస్సుల గందరగోళం

13-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ గుండా వెళ్లే కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొన్ని బస్సులు ప్రయాణికులకు ఇస్తున్న టికెట్‌పై ఉన్న బస్సు సంఖ్యకు, బస్సుపై ఉన్న నిజమైన సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకుండా నడుస్తుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని డివైఎఫ్ఐ జహీరాబాద్ పట్టణ కమిటీ కార్యదర్శి జే. శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ విధమైన అవకతవకలు ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆయన అన్నారు.ఈ విషయమై డివైఎఫ్ఐ నాయకులు ఈరోజు మోటార్ వాహనాల తనిఖీ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, వాస్తవంగా రోడ్డు మీద నడుస్తున్న బస్సు సంఖ్యకు, ప్రయాణికులకు ఇస్తున్న టికెట్‌పై ముద్రించిన సంఖ్యకు తేడా ఉండటం చట్ట విరుద్ధమని తెలిపారు. ఈ విషయం గురించి కండక్టర్లను, డ్రైవర్లను ప్రశ్నిస్తే “మేము ఉద్యోగులం, అధికారులతో మాట్లాడాలి” అని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా బస్సులు నడిపితే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన ప్రశ్నించారు. “మాకు తెలియదు” అని చెప్పడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకోవడం సరైనది కాదని స్పష్టం చేశారు. తక్షణమే సంబంధిత రవాణా అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. టికెట్‌పై ఉన్న సంఖ్యకు, బస్సుపై ఉన్న సంఖ్యకు తేడా ఉన్న బస్సులను వెంటనే నిలిపివేసి స్వాధీనం చేసుకోవాలని కోరారు.డివైఎఫ్ఐ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వ్యవహారాలను సహించబోమని హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు జోనా నరేష్, సంగమేశ్వర, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టికెట్ నంబర్ ఒకటి.. బస్సు నంబర్ మరోటి.. జహీరాబాద్‌లో కర్ణాటక బస్సుల గందరగోళం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News