Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:46 AM

తుంగతుర్తిలో మహిళల ఖాళీ బిందెల ఆందోళన

తుంగతుర్తిలో మహిళల ఖాళీ బిందెల ఆందోళన

తుంగతుర్తిలో మహిళల ఖాళీ బిందెల ఆందోళన
09-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గత రెండు నెలలుగా తాగునీరు సరఫరా కావడం లేదనమహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, రెండు నెలలుగా నల్లాల ద్వారా నీళ్లు రాకపోవడంతో తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీ కార్యవర్గం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పండుగలు సమీపిస్తున్నప్పటికీకనీసం వాడుకునేందుకు కూడా నీళ్లు లేక బోర్ల వద్ద నుంచి బిందెలతో నీళ్లు మోసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం కష్టంగా మారిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తుంగతుర్తి మండల కేంద్రానికి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మన్నూరు పూర్ణమ్మ, కటకం ఈశ్వరమ్మ, లింగమ్మ, తడకమళ్ల గంగమ్మ, తడకమళ్ల యాదమ్మ, తడకమళ్ల హేమలత, పానగంటి స్వప్న, కటకం రామ, జ్యోతి, కటకం రవి, బొంకూరి మల్లేశ్, తడకమళ్ల సోమయ్యతదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తిలో మహిళల ఖాళీ బిందెల ఆందోళన

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News