Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:46 AM

తిరువూరు లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక దాడి 4.60 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం – ఆటో డ్రైవర్ అరెస్ట్

11-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు: ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనను అధికారులు బయటపెట్టారు. సమాచారం అందిన వెంటనే పిడిఎస్ డీటీ కొంగర శ్వేత ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

తిరువూరు పట్టణంలోని రాజుపేట ప్రాంతం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను అధికారులు తనిఖీ చేయగా, అందులో సుమారు 4.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆటోను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆటోను స్థానిక పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అత్యవసర వస్తువుల చట్టం ప్రకారం 6-ఏ కేసు నమోదు చేసినట్లు పిడిఎస్ డీటీ కొంగర శ్వేత తెలిపారు.

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం లేదా రవాణా చేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Sthanikam

తిరువూరు లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక దాడి 4.60 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం – ఆటో డ్రైవర్ అరెస్ట్

Article Image

తిరువూరు: ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనను అధికారులు బయటపెట్టారు. సమాచారం అందిన వెంటనే పిడిఎస్ డీటీ కొంగర శ్వేత ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

తిరువూరు పట్టణంలోని రాజుపేట ప్రాంతం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను అధికారులు తనిఖీ చేయగా, అందులో సుమారు 4.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆటోను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆటోను స్థానిక పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అత్యవసర వస్తువుల చట్టం ప్రకారం 6-ఏ కేసు నమోదు చేసినట్లు పిడిఎస్ డీటీ కొంగర శ్వేత తెలిపారు.

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం లేదా రవాణా చేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News