Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..

24-03-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పోలీస్ స్టేషన్ల తనిఖీలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు..

నల్గొండ : ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలు అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ తనిఖీల్లో భాగంగా స్టేషన్ రికార్డులను, సిబ్బంది పనితీరును కూలంకషంగా పరిశీలించారు.

​స్టేషన్‌లోని రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, రైటర్ విభాగం, లాకప్ గదులను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల విచారణలో ఎలాంటి జాప్యం జరగకూడదని నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా పక్కా ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. బాధితులు స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి పట్ల మర్యాదగా ప్రవర్తించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.గ్రామ పోలీసు అధికారులు (GPOs) ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని ఎస్పీ సూచించారు. అత్యవసర పిలుపులు వచ్చినప్పుడు బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకోవాలి. నేరాల అదుపునకు పట్టణ, గ్రామ పరిధిలో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి. పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం..

​గంజాయి విక్రయాలు, అక్రమ ఇసుక రవాణా, పీడీఎస్ బియ్యం మళ్లింపు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ తనిఖీ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, తిప్పర్తి ఎస్సై శంకర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News