Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 PM

తిమ్మమ్మ మర్రిమాను వద్ద జరుగు తిమ్మమ్మ రధోత్సవంకు రండి తరలి రండి

తిమ్మమ్మ మర్రిమాను వద్ద జరుగు తిమ్మమ్మ రధోత్సవంకు రండి తరలి రండి

తిమ్మమ్మ మర్రిమాను వద్ద జరుగు తిమ్మమ్మ రధోత్సవంకు రండి తరలి రండి
February 05, 2026 07:43 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రపంచ రికార్డు పొందిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న తిమ్మమ్మ మర్రిమాను వద్ద అంత్యంత వైభవంగా భారీగా 3రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి . ఈ నెల 15వ తేది శివరాత్రి రోజున రథోత్సవం జరుగుతుంది. శ్రీ సత్య సాయి జిల్లా నంబలపూలకుంట మండలంలోని గూటిబైలు సమీపంలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద పెద్ద ఎత్తున కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు . రథోత్సవ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయండి.1989 లో బెంగుళూరు కు చెందిన సత్యనారాయణ అయ్యర్ అలియాస్ రిగ్రేట్ అయ్యర్ మెుట్టమెుదట తన కెమెరా లో బంధించి బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన కృషి ఫలితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. 2008 మరియు 2010 మధ్య ఔట్రీచ్ ఎకాలజీ నిర్వహించిన ల్యాండ్‌మార్క్ ట్రీస్ ఆఫ్ ఇండియా సర్వే, దేశవ్యాప్తంగా ఉన్న మర్రి చెట్ల విస్తీర్ణం కొలిచింది . భారతదేశం లోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఏడు మర్రి చెట్ల ఉన్నట్లు గుర్తించారు . వాటిలో తిమ్మమ్మ మర్రిమానును అన్నింటికంటే పెద్దదని వారు ధృవీకరించారు. ఈ చెట్టు ఎనిమిది ఎకరాలలో 6,869 ఊడలతో విస్తరించి ఉందని మరియు 660 పైగా సంవత్సరాల వయస్సు ఉందని స్థానిక అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ మహా వృక్షాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుండి కూడా సందర్శకులు వేలాదిగా వస్తుంటారు. మర్రిమాను కిందికి వెళ్తే ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ మర్రిఊడ కనిపిస్తుంది. ప్రతీ ఊడ చెట్టు మొదలు గానే అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరితో భూమంతా ఆక్రమించిన మహా వటవృక్షం సందర్శకులకు కనువిందు చేస్తుంది . మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు. పార్క్ నిర్మించాలని , ఇంకా ఇతరత్రా అభివృద్ధి పనులు నిర్వహించాలని 27 ఎకరాల భూమిని రైతులనుంచి1997-98లో సేకరించారు . తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు. ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి ఉంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద వివరాలు ఇలా ఉన్నాయి. "తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ వేంకటప్ప, మంగమ్మలకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసుకొన్నట్లు ఇక్కడి వారు చెబుతున్నారు.విష్ణువు బెరడుగా, బ్రహ్మ దేవుడు వేర్లుగా మరియు శివుడు కొమ్మగా కలిసిన ప్రదేశం అని ఆ తిమ్మమ్మ మరిమాను చెట్టులో ముగ్గురు దేవతలు నివసిస్తున్నారని చెబుతారు. అందుకే ఈ చెట్టును త్రిమూర్తీయం అని చెబుతారు.సంతానం కోసం ప్రార్థించే జంట ఈ ప్రదేశాన్ని సందర్శించి 'తిమ్మమ్మ'ను అంకితభావంతో పూజిస్తే, వారికి సంతానం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు.పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలి.పుట్టపర్తి, కదిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం , ప్రజాకవి కటారుపల్లి యోగివేమన సమాధి , తిమ్మమ్మ మర్రిమాను , ములకలచెరువు సమీపంలోని సోంపల్లెలో చారిత్రాత్మకమైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం,హార్సిలీ హిల్స్ లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ గా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. నేషనల్ హైవే జంక్షన్ కొక్కంటి నుంచి తిమ్మమ్మ మర్రిమాను వరకు అక్కడి నుంచి కదిరి హైవే వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేయాలి . అలాగే రాయచోటి హైవే నుంచి రెక్కమాను వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేయాలి. కదిరి , తిమ్మమ్మ మర్రిమాను ,కటారుపల్లె వద్ద అన్ని రకాల వసతులతో రిసార్ట్ లను , తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఉన్న 27ఎకరాలలో ఏకోపార్క్ ను నిర్మించాలి . ఈశ్వరమలై కొండలో ట్రెక్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలి. కటారుపల్లె లో థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలి. కదిరి దేవరచెరువు వద్ద పార్క్ నిర్మించి చెరువులో బోటింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలి.టూరిజం సర్క్యూట్ అభివృద్ధి కి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు వారి కృషి ఫలించి మంచి అభివృద్ధి జరగాలని ఆశిద్దాం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News