Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:19 PM

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయం.

14-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ముగ్గుల పోటీల్లో మహిళల సృజనాత్మకత ప్రతిబింబం: మట్టి పెళ్లి సైదులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు ప్రతీకలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు అన్నారు. బుధవారం మోతే మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సైదులు మాట్లాడుతూ, మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగలలో సంక్రాంతి ఒకటని అన్నారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడంలో ముగ్గుల పోటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం మన సంప్రదాయాలను గౌరవించినట్లేనని తెలిపారు. ముగ్గుల పోటీల్లో విజయం సాధించిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర పోతయ్య, మండల కమిటీ సభ్యులు బోడ పట్ల హుస్సేన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి వినయ్, విద్యార్థి నాయకురాలు మట్టిపల్లి మానస, సంఘం నాయకురాలు కటారి పార్వతమ్మ, కుంటి గొర్ల గంగమ్మ, చిట్యాల పద్మ, జంపాల ఉప్పయ్య, అక్కెనపల్లి నాగమ్మ, బోడ పట్ల సాంబమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News