Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

తెలంగాణ ఉద్యమ కారుల హామీలను వెంటనే అమలు చేయాలి

తెలంగాణ ఉద్యమ కారుల హామీలను వెంటనే అమలు చేయాలి

తెలంగాణ ఉద్యమ కారుల హామీలను వెంటనే అమలు చేయాలి
January 11, 2026 11:34 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

టి యూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాం రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ కారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇందుకోసం ఉద్యమకారులు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఉద్యమ కారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాం రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఉద్యమ కారుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభలో వారు ఈ మేరకు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ జిల్లా ఇన్‌చార్జి పిడమర్తి లింగయ్య అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వలనో కాదు, అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక కమిటీని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది అమరులైతే, గత ప్రభుత్వం కేవలం 400 మంది కుటుంబాలకే న్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట ప్రాంతం ఉద్యమ చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఉద్యమకారుల హామీలను అమలు చేయని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

తెలంగాణ సాయుధ పోరాటం తరహాలో ఉద్యమం సాగించాలని, తెలంగాణ ఉద్యమ సాధనలో పాల్గొన్న వారిని “జంగు సిపాయిలు”గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసులను వెంటనే ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ యూఏపీఏ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని, మారోజు వీరన్న స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని మహాసభలో తీర్మానించారు.

అలాగే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అమలు చేయాలని, ఖాయిలపడ్డ పరిశ్రమలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కంచర్ల బద్రి, చారువాక, జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వేముల యాదగిరి, ఉద్యమకారులు చెరుకు సుధాకర్, బహుజన గాయకురాలు విమలక్క, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తాడోజు వాణి, సీఈఓ తాడోజు శ్రీకాంత్ రాజు, డాక్టర్ పృథ్విరాజ్ యాదవ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కె. ధర్మార్జున్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్, ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొడుగు శ్రీధర్, ఉద్యమకారుల మహిళా వేదిక రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు, ఉద్యమకారుల జేఏసీ నాయకురాలు గోనె విజయ, కట్ట రాజన్న, యూసుఫ్ షరీఫ్, దయాకర్, ఎస్‌కే సయ్యద్, గాయకులు దరువు అంజన్న, సురేష్ మహజన్, సుక్క రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News