Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:22 PM

తెలంగాణ రాజ్యాధికార పార్టీకి “కత్తెర” గుర్తు – ప్రజల ఆశలకి ప్రతీక

14-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బోగి–సంక్రాంతి–కనుమ శుభాకాంక్షలు తెలిపిన వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి భారత ఎన్నికల కమిషన్ అధికారికంగా “కత్తెర” ఎన్నికల గుర్తును కేటాయించడం పార్టీ చరిత్రలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ గారు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, ఉద్యమ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రోజురోజుకు బలోపేతమవుతూ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించుకుంటోందని పేర్కొన్నారు.“కత్తెర గుర్తు ప్రజల జీవితాల్లోని అన్యాయాలను కత్తిరించి, సమానత్వం, న్యాయాన్ని నెలకొల్పే శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తుంది” అని వట్టే జానయ్య యాదవ్ స్పష్టం చేశారు. పేదలు, బీసీలు, దళితులు, ఆదివాసీలు, కూలీలు, రైతుల హక్కుల పరిరక్షణే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అదేవిధంగా సంక్రాంతి పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల పండుగైన సంక్రాంతి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో నిజమైన ప్రజాపాలన తీసుకురావడమే లక్ష్యంగా, రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుతో ప్రజల ముందుకు వెళ్లి, ప్రజా సమస్యలపై నిర్భయంగా పోరాడతామని వట్టే జానయ్య యాదవ్ గారు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

తెలంగాణ రాజ్యాధికార పార్టీకి “కత్తెర” గుర్తు – ప్రజల ఆశలకి ప్రతీక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News