Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

త్రినిటీ విద్యాసంస్థల్లో అగ్నిమాపక అవగాహన సదస్సు

13-03-2026 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫైర్ అండ్ డిజాస్టర్ శాఖ ఆధ్వర్యంలో త్రినిటీ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థి, విద్యార్థినులకు వంటగ్యాస్ వలన సంభవించే ప్రమాదాలు, వాటి నివారణ చర్యలను ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పించారు.ఫైర్ ఎక్విప్మెంట్‌ను ఎలా ఉపయోగించాలి, అగ్ని ఎలా మండుతుంది అనే విషయాలను అధికారులు వివరించారు.చెక్క, పుస్తకాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు, అలాగే ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ద్రవ పదార్థాలు వేడి, ఆక్సిజన్ కలిసినప్పుడే అగ్ని వ్యాపిస్తుందని తెలిపారు.అగ్ని నియంత్రణకు ఆక్సిజన్ అందకుండా చేయడానికి ఫోమ్, కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించాల్సి ఉంటుందని, వేడిని తగ్గించడానికి నీరు లేదా ఐస్ వాడితే అగ్ని ఆర్పవచ్చని ప్రదర్శన ద్వారా వివరించారు.

అలాగే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వెంటనే 101 ఫైర్ సర్వీస్,100 పోలీస్, 108 అంబులెన్స్‌కు కాల్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా విపత్తు నివారణ బృందం లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్. అనిల్ కుమార్, టెక్నికల్ ఫైటర్ కె. శేఖర్, ఫైర్ ఫైటర్లు టి. ప్రసాద్, వి. పాండు, వి. భాగ్య నాయకులు విద్యార్థులకు సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జీని మంజుల, చైర్మన్ కెవిబి కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

త్రినిటీ విద్యాసంస్థల్లో అగ్నిమాపక అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News