Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

తప్పుడు వివరాలతో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేస్తే కఠిన చర్యలు. చీటింగ్ కేసులు నమోదు చేసే అవకాశం

19-05-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో 2026–28 సంవత్సరాలకు సంబంధించిన మీడియా అక్రిడేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఇతర సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ జర్నలిస్టులుగా దరఖాస్తు చేసినట్లు జిల్లా పౌర సంబంధాల కార్యాలయం వెల్లడించింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజూ క్రియాశీలకంగా మీడియా రంగంలో పనిచేసే జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తారని స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగాలు చేస్తూ తప్పుడు వివరాలతో దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

ఇలాంటి వారిపై చీటింగ్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే వారు పనిచేస్తున్న ప్రభుత్వ లేదా ఇతర సంస్థల్లో సస్పెన్షన్ వంటి చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపింది.

అక్రిడేషన్ కోసం తప్పుడు వివరాలతో దరఖాస్తు చేసిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తమ దరఖాస్తులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు చేపడతామని పీఆర్‌వో కార్యాలయం హెచ్చరించింది.

Sthanikam

తప్పుడు వివరాలతో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేస్తే కఠిన చర్యలు. చీటింగ్ కేసులు నమోదు చేసే అవకాశం

Article Image

జిల్లాలో 2026–28 సంవత్సరాలకు సంబంధించిన మీడియా అక్రిడేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఇతర సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ జర్నలిస్టులుగా దరఖాస్తు చేసినట్లు జిల్లా పౌర సంబంధాల కార్యాలయం వెల్లడించింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజూ క్రియాశీలకంగా మీడియా రంగంలో పనిచేసే జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తారని స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగాలు చేస్తూ తప్పుడు వివరాలతో దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

ఇలాంటి వారిపై చీటింగ్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే వారు పనిచేస్తున్న ప్రభుత్వ లేదా ఇతర సంస్థల్లో సస్పెన్షన్ వంటి చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపింది.

అక్రిడేషన్ కోసం తప్పుడు వివరాలతో దరఖాస్తు చేసిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తమ దరఖాస్తులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు చేపడతామని పీఆర్‌వో కార్యాలయం హెచ్చరించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News