Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:41 AM

తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి అనంతపురం డీఎంహెచ్ఓ.డా. ఈ బి. దేవి

తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి అనంతపురం డీఎంహెచ్ఓ.డా. ఈ బి. దేవి

తప్పనిసరి  పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి అనంతపురం డీఎంహెచ్ఓ.డా. ఈ బి. దేవి
February 11, 2026 04:32 AM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సాధారణ కాన్పు సాధ్యం కాని సందర్భంలో సిజేరియన్ చేయాలని అలా అని సిజేరియన్ అవసరం లేని కాన్పులకు సిజేరియన్ చేయడం సరైనది కాదని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ బి దేవి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలో గత నెలలో జరిగిన మాతృ శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పుట్లూరు మండల పరిధిలో పసాల సరస్వతి అనే మహిళ కాన్పు సందర్భంగా మరణించడంపై విచారణ చేస్తూ సంబంధిత వైద్యులు సిబ్బందిపై మండిపడ్డారు. ఆ మహిళకు సకాలంలో సిజరిన్ చేసి ఉండవలసినదని విశ్లేషించారు. మృతురాలి కుటుంబ సభ్యులు సిజరిన్ వద్దన్నారని అందువల్ల తాము చేయలేకపోయామని సంబంధిత డాక్టర్ చెప్పడం పట్ల అభ్యంతరము వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా కాన్పులు జరపాలని తద్వారా మాతృ మరణాలు నివారించాలని, కుటుంబ సభ్యులకు సకాలంలో అవగాహన కల్పించ వలసిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. అవగాహన కల్పించకపోయిన మహిళా సూపర్వైజర్, ఆరోగ్య కార్యకర్త, ఆశలకు మెమోలు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది గర్భవతులకు సరైన అవగాహన ,ఆరోగ్య విద్య అందించాలని కోరారు. అలాగే మహిళా కాన్పు విషయంలో సిజేరియన్ అవసరమైన సందర్భంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన తాడిపత్రిలోని నిహార ఆసుపత్రికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గత నెల రోజులుగా జరిగిన ఆరు శిశు మరణాలపై కూడా సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు వివరించారు. అలాగే భవిష్యత్తులో మాతృ మరణాలు శిశు మరణాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన పలు విషయాలను తెలియపరిచారు. ముఖ్యంగా ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడి సెంటర్ లో ఇచ్చే పోషకాహారం తినేలాగా ఏఎన్ఎం,ఆశా తగు చర్యలు తీసుకోవాలని, గర్భం దాల్చి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వారికి అందించేటువంటి వైద్య సేవలు అలాగే డెలివరీ తర్వాత 42 రోజులు పాటు తల్లి బిడ్డకు అందించేటువంటి వైద్య సేవలు పట్ల నిర్లక్ష్యం లేకుండా వైద్య సేవలు అందించినట్లయితే తల్లి బిడ్డ మరణాలను అరికట్టవచ్చని తెలియజేశారు. తక్కువ బరువుతో తో పుట్టిన పిల్లలను గుర్తించి వారిని వెంటనే న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించాలని ఆదేశించారు. అంతిమంగా మాతృ మరణాలు శిశు మరణాలు జరగకుండా సంబంధిత అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఓ.డాక్టర్. శేషు భూషణ్ రెడ్డి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గైనకాలజీ విభాగం వైద్యులు డాక్టర్ రేణుక, చిన్నపిల్లల విభాగం వైద్యులు డాక్టర్ దినకర్,లోకనాథ్, అనస్థీషియా విభాగం డాక్టర్ సోమశేఖర్, అలాగే డిఎంహెచ్వో కార్యాలయ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ విష్ణుమూర్తి, డిపిహెచ్ఎన్ఓ ప్రమీల, హేమలత, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News