Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:22 PM

తోర్నల్ గ్రామంలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం

31-12-2025 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలోని తోర్నల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని పేద మరియు మధ్యతరగతి మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, వారి గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి మహిళకు చీరలు అందేలా గ్రామస్థాయిలో ఈ పథకం సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు.

మహిళలు కుటుంబానికే కాదు, సమాజ నిర్మాణానికి కూడా పునాదులని పేర్కొన్న ఆయన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నాయంటే అది ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల జీవితాల్లో సంక్షేమ పథకాలు సానుకూల మార్పులు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అందుకే మహిళల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకొని పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాజకీయ భేదాలను పక్కనపెట్టి గ్రామస్థాయిలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. చీరలు అందుకున్న మహిళలు ప్రభుత్వానికి మరియు నూతన సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

తోర్నల్ గ్రామంలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News