Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:39 AM

తమ్మిలేరు పై వంతెన కోసం సిపిఐ ఎమ్ఏ లిబరేషన్ ధర్నా

తమ్మిలేరు పై వంతెన కోసం సిపిఐ ఎమ్ఏ లిబరేషన్ ధర్నా

తమ్మిలేరు పై వంతెన కోసం సిపిఐ ఎమ్ఏ లిబరేషన్ ధర్నా
February 22, 2026 07:13 PM 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గుళ్ళపూడి–కొణిజర్ల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్

సీపీఐ ఎమ్ఏ లిబరేషన్ అనుబంధ అఖిలభారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం గుళ్ళపూడి గ్రామం మరియు లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామాల మధ్య ప్రవహిస్తున్న తంబిలేరు పై వంతెన నిర్మించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పామర్తి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ గ్రామస్తుల సమస్యలను వివరించారు.

గుళ్ళపూడి గ్రామస్తులకు కొణిజర్ల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని, పంట కోత సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వరదల సమయంలో తంబిలేరు ఉప్పొంగి పొలాలు ముంపుకు గురవుతుండటంతో పాటు పంట నష్టం వాటిల్లుతోందన్నారు. ధర్మాజీగూడెం మీదుగా కొణిజర్ల చేరుకోవాలంటే సుమారు 14 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోందని, పర్లాంగు దూరంలో ఉన్న పొలాలకు చేరుకోవాలన్నా అదే దూరం తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజువారీ కూలీలు, పశువులు, మేకలు, గొర్రెలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఘటనలు జరుగుతున్నాయని, కాపరులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఏరు దాటాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

భూములు లింగపాలెం మండలానికి చెందినవని, ప్రభుత్వ కార్యాలయాలు, చింతలపూడి భూమి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాలన్నా, ఆసుపత్రులు, కాలేజీలకు రాకపోకలు సాగించాలన్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నూజివీడు, విజయవాడ, అమరావతి వెళ్లేందుకు ఈ మార్గం అత్యంత సమీపమని, సమయం–ఖర్చు ఆదా అవుతుందని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

అందువల్ల గుళ్ళపూడి–కొణిజర్ల గ్రామాల మధ్య తక్షణం వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, అంచనాలు రూపొందించి, మంత్రి పార్థసారధి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 2న ఏలూరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా లోపూడి–వలసపల్లి క్రాస్ రోడ్డు వరకు ఆర్ & బి రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పల్లె పాము భవాని, పామర్తి రాజేశ్వరి, పామర్తి సత్యనారాయణ, చిట్టిమాద సీతారామయ్య, గోళ్ళ కొండయ్య తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News