Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంధువులు, స్నేహితుల మధ్య మానస జన్మదిన వేడుకలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 08:48 PM

తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు

తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు

తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు
17-02-2026 435 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏకమై ముందడుగు వేసిన తాళ్లఖమ్మంపహడ్ యువత

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

సూర్యాపేట రూరల్ మండలం: జన్మనిచ్చిన తల్లి, అక్షర జ్ఞానం అందించిన బడి, ప్రయోజకుడిగా మార్చిన గ్రామం ప్రతి ఒక్కరి జీవితంలో చెరగని గుర్తులుగా నిలుస్తాయి. ఈ భావనతోనే సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని తాళ్లఖమ్మంపహడ్ గ్రామ యువత ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.గ్రామంలోని దేవిరెడ్డి రాంరెడ్డి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో పెయింటింగ్ చేయించి పాఠశాల భవనానికి కొత్త కళను తెచ్చారు. గ్రామానికి చెందిన ఇరవై మంది యువకులు తమ స్వంత ఖర్చులతో తలా కొంత మొత్తం సమకూర్చి తరగతి గదులు, పాఠశాల గోడలకు అందమైన రంగులు వేయించారు.

తరగతి గదుల గోడలపై విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సంబంధిత బొమ్మలు, చిత్రాలు వేయించి పాఠశాల వాతావరణాన్ని ఆకర్షణీయంగా మార్చారు. ఎన్నో సంవత్సరాలుగా రంగులు వేయకపోవడంతో అద్వానంగా మారిన భవనం ఇప్పుడు నూతన రూపంతో మెరిసిపోతోంది. చేతిలో రూపాయి ఉంటే వ్యసనాలకు లోనవుతున్న నేటి యువతకు భిన్నంగా తాళ్లఖమ్మంపహడ్ యువకులు సమాజ సేవలో ఆదర్శంగా నిలిచారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన వారిని గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు కూడా పెయింటింగ్ చేయించి అందంగా తీర్చిదిద్దేందుకు యువత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామ అభివృద్ధికి యువత తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ “శభాష్” అని మెచ్చుకుంటున్నారు.

Sthanikam

తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు

Article Image

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News