Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కంగ్టి సిఐ

27-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం, కంగ్టి సర్కిల్ పరిధిలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో దొంగలు ముఖ్యంగా బంగారం మరియు వెండి వస్తువులపై ఎక్కువగా దృష్టి పెట్టుతున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం పొట్పల్లి తండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుందని తెలిపారు.ఈ నేపథ్యంలో కంగ్టి సర్కిల్ పరిధిలోని ప్రజలు క్రింది విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు:

ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగారం తక్కువగా ధరించడం మంచిది.

ఊరికి బయటకు వెళ్లేటప్పుడు నగదు, బంగారం, వెండి వస్తువులను ఇంట్లో ఉంచకుండా మీ వెంట తీసుకెళ్లాలి లేదా బ్యాంకు గది లో, లేక నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దు.

ఇళ్లలో తప్పనిసరిగా భద్రతా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

ఆలయాలలో కూడా విలువైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే అక్కడ కూడా భద్రతా కెమెరాలు ఏర్పాటు చేయాలి.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసు శాఖకు సహకరించి దొంగతనాలను నివారించడంలో భాగస్వాములు కావాలని కోరారు.

Sthanikam

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కంగ్టి సిఐ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News