Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:37 AM

తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

14-02-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో చనిపోతానని చెప్పి, ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడకు వచ్చిన చిలకలపూడికి చెందిన ఓ మహిళను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు.చిలకలపూడి పోలీసులు విజయవాడ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ కి సదరు ఘటనపై సమాచారం ఇవ్వగా వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ సంబంధిత స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజ్ సమీపంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ. శ్రీధర్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ 1520 భూషణం ప్రకాశం బ్యారేజ్ పై నుండి దూకడానికి ప్రయత్నిస్తున్న ఆ మహిళను ఆమె ఇద్దరు పిల్లలను రక్షించి ప్రాణాలను కాపాడారు. అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా, తక్షణ స్పందనతో తల్లి మరియు పిల్లల ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు అభినందించారు

Sthanikam

తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

Article Image

కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో చనిపోతానని చెప్పి, ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడకు వచ్చిన చిలకలపూడికి చెందిన ఓ మహిళను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు.చిలకలపూడి పోలీసులు విజయవాడ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ కి సదరు ఘటనపై సమాచారం ఇవ్వగా వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ సంబంధిత స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజ్ సమీపంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ. శ్రీధర్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ 1520 భూషణం ప్రకాశం బ్యారేజ్ పై నుండి దూకడానికి ప్రయత్నిస్తున్న ఆ మహిళను ఆమె ఇద్దరు పిల్లలను రక్షించి ప్రాణాలను కాపాడారు. అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా, తక్షణ స్పందనతో తల్లి మరియు పిల్లల ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు అభినందించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News