Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

తాజ్ పూర్ గ్రామంలో యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ - ఏసీఎఫ్ (ACF) ప్రత్యేక హెల్త్ క్యాంప్

19-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపడుతున్న యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ (ACF) కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇటీవల డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ గారు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ లో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నోడల్ అధికారి DTCO డాక్టర్ వంశీకృష్ణ హాజరై గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. క్యాంప్‌లో భాగంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యంగా క్షయ, జ్వరాలు,రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడమే ఈ ఏసీఎఫ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ...గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించిన వైద్య బృందానికి మరియు సహకరించిన గ్రామ పంచాయతీ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి నెల లేదా రెండు నెలలకొకసారి ఇటువంటి హెల్త్ క్యాంపులు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందిని కోరారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రభుత్వ వైద్య సిబ్బంది. ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.గ్రామ స్థాయిలో ముందస్తు పరీక్షలు పెంచితే అనేక రోగాలను ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, ప్రభుత్వ వైద్య బృందం, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

తాజ్ పూర్ గ్రామంలో యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ - ఏసీఎఫ్ (ACF) ప్రత్యేక హెల్త్ క్యాంప్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News