Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:56 AM

తెలంగాణ యువజన సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి

08-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన క్యాలెండర్–2026ను మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శనివారం సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ యువజన సంఘం సమాజంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయడం, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కోసం వివిధ దశలలో ఉద్యమాలు నిర్వహించడాన్ని అభినందించారు. విద్యార్థులు, యువకులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సమాజంలోని అవలక్షణాలకు దూరంగా ఉండి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచించారు.

తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉచిత నాణ్యమైన విద్య, మెరుగైన ఉచిత వైద్యం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో అనుమతులు, అర్హతలు లేకుండానే పుట్టగొడుగుల్లా ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అధిక ఫీజుల నియంత్రణ కోసం ఈ ఆర్థిక సంవత్సరం, విద్యాసంవత్సరం ఆరంభంలోనే జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులతో “ఫీ రెగ్యులేషన్ కమిటీ” ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించాలని కోరారు. విద్య, వైద్యం రంగాల్లో అవినీతికి సహకరించే ప్రభుత్వ అధికారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్ కర్రే సత్యనారాయణ, రాష్ట్ర సీనియర్ నాయకులు భాషిపంగు సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు సంతోష్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోరెళ్ల విప్లవ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు సురేష్ నాయక్, జిల్లా కార్యదర్శి ధరవాత్ శివ, నాయకులు వడ్డెపల్లి నరేష్, దారావత్ వెంకటేష్ నాయక్, నకిరేకంటి సందీప్, బానోత్ నవీన్, బోడ పవన్, శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ యువజన సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News