Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 10:24 AM

పూలే ఆశయాలను కొనసాగిద్దాం..

పూలే ఆశయాలను కొనసాగిద్దాం..

పూలే ఆశయాలను కొనసాగిద్దాం..
11-04-2026 196 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఘనంగా మహాత్ముని 200వ జయంతి వేడుకలు..

నివాళులర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు..

నల్లగొండ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలను శనివారం నల్లగొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గడియారం సెంటర్‌లో ఉన్న పూలే విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ మాట్లాడుతూ.. దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం కోసం పూలే పడిన తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో నాయకులు మారగోని గణేష్, పెరిక యాదయ్య, బాణావత్ దీప్లా, పెండెం ధనుంజయ, బొజ్జ వెంకన్న, కందుల లక్ష్మయ్య, గంజి రాజేందర్, వజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పూలే ఆశయాలను కొనసాగిద్దాం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News