Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 10:19 AM

నల్లగొండలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్..

11-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

హైవేలపై ఆగివున్నా వాహనలే లక్ష్యంగా డీజిల్ దొంగతనం..

ఆరుగురు నిందితుల అదుపులోకి.. ఒకరు మైనర్..

రూ. 40 లక్షల విలువైన సొత్తు స్వాధీనం..

నల్లగొండ : జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ డీజిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా సభ్యులు గత కొంతకాలంగా రాత్రి సమయాల్లో హైవేలపై లారీలు, ట్రక్కుల నుంచి డీజిల్‌ను తోడేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. శనివారం చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను జిల్లా అదనపు ఎస్పీ జి.రమేష్ వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా హైవేలపై వరుసగా జరుగుతున్న డీజిల్ దొంగతనాలను అరికట్టేందుకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో చిట్యాల పోలీసులు మరియు సీసీఎస్ బృందాలు నిఘా పెంచగా శుక్రవారం రాత్రి హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఒక డీసీఎం వాహనం పోలీసుల కంటపడింది. ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా పైన వడ్ల పట్టాలు కప్పి లోపల రహస్యంగా డీజిల్ నింపిన క్యాన్లను దాచిపెట్టినట్లు గుర్తించారు. డ్రైవర్ బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా పక్కా ప్రణాళికతో సాగుతున్న ఈ ముఠా భాగోతం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు మరో డీసీఎం వాహనంతో పాటు మొత్తం ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పల్నాడు జిల్లాకు చెందిన ముడావత్ గాంధీ నాయక్, ముడావత్ వెంకటేశ్వర్లు, బనావత్ తుల్స్య, ముడావత్ బాలకృష్ణ, రామవత్ వాగ్యలతో పాటు ఒక మైనర్ బాలుడు ఉన్నారు. నిందితులు తొలుత హైవేలపై డ్రైవర్లు నిద్రపోతున్న వాహనాలను గుర్తించి, క్షణాల్లో ట్యాంకులు పగులగొట్టి డీజిల్‌ను తమ వాహనాల్లోకి మార్చుకునేవారని పోలీసులు తెలిపారు.

వీరి వద్ద నుంచి రూ. 40 లక్షల విలువైన 1000 లీటర్ల డీజిల్, రెండు డీసీఎంలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు తేలింది. ఈ దొంగతనాల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ శివరాం రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు జితేందర్ రెడ్డి, నాగరాజు మరియు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలను ప్రకటించారు. హైవేలపై ప్రయాణించే వారు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Sthanikam

నల్లగొండలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News