Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:19 PM

రోడ్డు భద్రతపై ఉక్కుపాదం: 'నో హెల్మెట్ - నో పెట్రోల్'

11-04-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి ఆదేశం

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా చౌటుప్పల్ పోలీస్ యంత్రాంగం సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. శనివారం మధ్యాహ్నం చౌటుప్పల్ డీఎస్పీ కార్యాలయంలో మండలంలోని పెట్రోల్ బంక్ యజమానులతో డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి (క్షేమంగా చేరండి - జీవించండి) కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, వాహనదారుల ప్రాణ రక్షణ కోసం పెట్రోల్ బంక్ యజమానులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయకూడదు. కార్లలో వచ్చే వారు సీటు బెల్ట్ ధరించకపోతే ఇంధనం నింపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ లేదా డీజిల్ కేవలం వాహనాల్లోకి మాత్రమే నింపాలి. బాటిళ్లు, క్యాన్లలో విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని, దీన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి పెట్రోల్ బంకులో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి. అవి కేవలం బంక్ లోపలే కాకుండా, బయట మెయిన్ రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా అమర్చాలని సూచించారు.​"ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరాలన్నదే మా తపన. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. డీఎస్పీ మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్.ఐ.లు కనకటి యాదగిరి, కె. ఉపేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మండలంలోని పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతపై ఉక్కుపాదం: 'నో హెల్మెట్ - నో పెట్రోల్'

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News