Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 10:20 AM

నల్లగొండ ఐటీ టవర్‌లో ‘ఇన్నోవేషన్ పంచాయత్’..

11-04-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

గ్రామీణ మేధస్సుకు ‘ఇన్నోవేషన్’ ఊతం..

తరలివచ్చిన ఉమ్మడి జిల్లా ఆవిష్కర్తలు..

మార్గదర్శకత్వం వహించిన హైదరాబాద్ నిపుణులు..

నల్లగొండ : మారుమూల గ్రామాల్లోని వినూత్న ఆలోచనలకు రెక్కలు తొడిగి వాటిని విజయవంతమైన వ్యాపారాలుగా మార్చేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. శనివారం నల్లగొండలోని ఐటీ టవర్‌లో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. నల్లగొండతో పాటు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల నుంచి సుమారు 60 మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, గ్రామీణ ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనలతో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

రాజధానిలోని స్టార్టప్ సంస్కృతిని జిల్లాలకు చేరువ చేయడమే లక్ష్యంగా సాగిన ఈ భేటీలో.. హైదరాబాద్‌కు చెందిన 12 మంది అగ్రశ్రేణి మెంటార్లు ఆవిష్కర్తలకు మార్గదర్శకత్వం వహించారు. వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణహిత ఇంధన వనరుల రంగాల్లో స్థానిక యువత రూపొందించిన నమూనాలను (ప్రోటోటైప్స్) నిపుణులు పరిశీలించారు. నిధుల సమీకరణ, మార్కెటింగ్ మెళకువలు, వ్యాపార విస్తరణలో ఎదురయ్యే సవాళ్లపై ఆవిష్కర్తలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.

నల్లగొండలో టీజీఐసీ కేంద్రం ఉండాలి.. కలెక్టర్

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కేవలం ఆలోచనలు ఉండటమే కాకుండా వాటిని ఆచరణలోకి తెచ్చే స్పష్టత ఉన్నప్పుడే విజయం సాధ్యమన్నారు. నల్లగొండ జిల్లా విద్యా కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడి యువతకు నిరంతరం తోడ్పాటు అందించేందుకు ఐటీ టవర్‌లో టీజీఐసీ తన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని టెక్ హబ్‌ల తరహాలోనే జిల్లాల్లోనూ ఆవిష్కరణల నాడి బలంగా ఉందని టీజీఐసీ సీఈఓ మెరాజ్ ఫహీమ్ అభివర్ణించారు. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో జోడించి స్థానిక ఆవిష్కర్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. గ్రామీణ ఆవిష్కరణలకు ప్రభుత్వ మద్దతును నేరుగా అందించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ బృందం, స్థానిక అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండ ఐటీ టవర్‌లో ‘ఇన్నోవేషన్ పంచాయత్’..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News