Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:55 AM

తెలంగాణ ఉద్యమ.. ఆయుధాలు జర్నలిస్టులు

తెలంగాణ ఉద్యమ.. ఆయుధాలు జర్నలిస్టులు

తెలంగాణ ఉద్యమ.. ఆయుధాలు జర్నలిస్టులు
08-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శాసన సభలో .. షాద్ నగర్ జర్నలిస్టుల ప్రస్తావన..

మొదటిసారి జర్నలిస్టుల తరపున గళం వినిపించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

12 ఏళ్ల కాలంలో ఎవరికి పట్టని జర్నలిస్టులు..

థాంక్యూ ..శంకరన్నా..

ఎమ్మెల్యే వీర్లపల్లికి షాద్ నగర్ జర్నలిస్టుల సత్కారం

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :సంస్థలు వద్దని వారించినా.. సంఘాలు ఎందుకులే.. అని తీర్మానించిన అక్షర యోధులు ఆగలేదు.. ఒకవైపు అక్షరంతో ఉద్యమానికి ఊపిరి పోస్తూ.. ఉద్యమ కాలంలో రోజంతా అక్కడే గడిపేస్తూ ఆందోళనకు ఆయుధంగా నిలిచారు.. అంతేకాకుండా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వాలు గుర్తించకపోయినా ఉద్యమకారులుగా పేరు తెచ్చుకున్నారు.. అయినా గడిచిన 12 ఏళ్ల కాలంలో అసెంబ్లీలో జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ ప్రస్తావన లేదు.. వారికి ఎలాంటి కృతజ్ఞతలు చెప్పలేదు.. అసలు వాళ్ళ ఊసే ఎక్కడా కనిపించలేదు.. పైపెచ్చు తెలంగాణ వచ్చాకే జర్నలిస్టులపై కేసులు, దాడులు పెరిగాయి. అలాంటిది 12 ఏళ్ల తర్వాత ఒక ఎమ్మెల్యే జర్నలిస్టుల ప్రస్తావన తెచ్చారు. వాళ్లకు ప్లాట్లు ఇవ్వాలని అడిగారు. ఉద్యమంలో వారి పాత్ర గురించి మాట్లాడారు.. ఆయన ఎవరో కాదు.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అవును.. ఇటీవల అసెంబ్లీలో జర్నలిస్టుల సమస్యల గురించి మొట్టమొదటిసారి షాద్ నగర్ జర్నలిస్టులను ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రస్తావించారు. ప్రభుత్వం స్పందిస్తుందా..? జర్నలిస్టులకు ఫ్లాట్లు ఇస్తుందా..? అన్నది అప్రస్తుతం.. కానీ ఒక ఎమ్మెల్యే జర్నలిస్టులను గుర్తుపెట్టుకొని వారి సమస్యల గురించి మాట్లాడడం ప్రశంసనీయం. అందుకే షాద్ నగర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను పాత్రికేయులు శాలువాలతో సత్కరించారు. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా తనకు తెలుసని ఈ సందర్భంగా వెల్లడించారు. నియమావళి ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు తప్పనిసరిగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టులు ఎండి ఖాజాపాషా (కేపీ), లట్టుపల్లి మోహన్ రెడ్డి, కస్తూరి రంగనాథ్, సంజయ్ కుమార్, శరత్, శ్రీశైలం, భాస్కర్, జాకీర్, ధనరామ్ రమేష్, షకీల్, ఎస్పీ బాలు, జగన్, రాకేష్, నరసింహారెడ్డి, 6 టీవీ శ్రీను, ఇలియాజ్, సమీ, రియాజ్, శివ తదితర జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

Sthanikam

తెలంగాణ ఉద్యమ.. ఆయుధాలు జర్నలిస్టులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News