Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

07-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధిబిక్షం

తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డు, ఏఎఫ్‌ఓ కన్సల్టెన్సీ కార్యాలయం నందు లంబడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దారావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం యూనియన్ సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సూర్యాపేటకు వచ్చిన నూతనంగా ఎన్నికైన గిరిజన ఉపసర్పంచులు సమావేశమై, తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా బానోతు సురేష్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు బానోతు సురేష్ నాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన గిరిజన నాయకులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, వివిధ ఉపకమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఉపసర్పంచులకు కూడా సర్పంచుల మాదిరిగా గౌరవ వేతనం ఇవ్వాలని, గ్రామాల అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కల్పించాలని, ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఉపసర్పంచులు అనిల్ నాయక్, రవితేజ నాయక్, నాగేశ్వరావు నాయక్, విజయ నాయక్, మోహన్ నాయక్, రామ్ సింగ్ నాయక్, ఇస్లావత్ బాలు నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News