Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:32 AM

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్

02-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని/ఎమ్మిగనూరు:

ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ నగర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) పదో తరగతి విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పీఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర నాయకుడు రఘునాథ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది మాట్లాడుతూ, టీసీల కోసం వచ్చే విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి వసూళ్లు జరగడం దురదృష్టకరమన్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై అదనపు భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యాహక్కు చట్టంలో విద్యార్థుల నుంచి ఇలాంటి వసూళ్లకు ఎక్కడ అవకాశం ఉందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ అక్రమ వసూళ్లు ఒక్క ఏడాదికే పరిమితం కావని, సంబంధిత హెచ్‌ఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్

Article Image

ఆదోని/ఎమ్మిగనూరు:

ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ నగర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) పదో తరగతి విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పీఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర నాయకుడు రఘునాథ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది మాట్లాడుతూ, టీసీల కోసం వచ్చే విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి వసూళ్లు జరగడం దురదృష్టకరమన్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై అదనపు భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యాహక్కు చట్టంలో విద్యార్థుల నుంచి ఇలాంటి వసూళ్లకు ఎక్కడ అవకాశం ఉందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ అక్రమ వసూళ్లు ఒక్క ఏడాదికే పరిమితం కావని, సంబంధిత హెచ్‌ఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News