Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:27 AM

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.

02-06-2026 240 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన దళిత నాయకుడు గడ్డం యాదగిరి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. యాదగిరి నియామకంపై దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 57 ఉపకులాల వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, వివిధ దశల్లో ప్రజా సేవలో కొనసాగుతూ వచ్చినట్లు పేర్కొన్నారు.

1996లో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరిన ఆయన గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరి గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా టీజేఎస్‌లో కొనసాగుతూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మద్దతు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తన సామాజిక సేవలను గుర్తించి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. చిందు సామాజిక వర్గానికి చెందిన తనకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని చెప్పారు.

Sthanikam

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News