Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు

18-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ రవాణా, పంపిణీ సేవలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపాయి.

ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్‌ సరఫరాలో 14.2 శాతం, డీజిల్‌ సరఫరాలో 15.7 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించాయి. వేసవి ప్రభావంతో గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్‌ కొంత తగ్గాయని, ఇది సాధారణ పరిస్థితేనని పేర్కొన్నాయి.

ఈ నెలలో నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపాయి. ఎస్‌ఎంఎస్‌, మిస్డ్‌ కాల్‌, ఐవీఆర్‌ఎస్‌, ఆన్‌లైన్‌ వేదికల ద్వారా సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని వినియోగదారులను సూచించాయి.

ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీ అథెంటికేషన్ కోడ్‌ (డీఏసీ) విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డీఏసీ అమలు 95 శాతానికి పైగా ఉందని, దానిని వంద శాతానికి చేర్చేందుకు వినియోగదారుల సహకారం అవసరమని తెలిపాయి.

నకిలీ వార్తలు, వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఓఎంసీలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

Sthanikam

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News