Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత

03-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌, మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

సోమవారం ఉదయం 8 గంటల తర్వాత సేవలు పునఃప్రారంభం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల సేవలు 36 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్‌ చేయడం, సాంకేతిక పరమైన మెయింటెనెన్స్ పనులు చేపట్టడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మీసేవ వెబ్‌సైట్‌తో పాటు అన్ని సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలు ఈ వ్యవధిలో అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.అధికారుల ప్రకటన ప్రకారం, ఈ సేవలు సోమవారం ఉదయం 8 గంటల తర్వాత తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అమలు ద్వారా సేవల వేగం, పారదర్శకత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

అత్యవసర పనుల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయించే ప్రజలు ముందుగానే తమ పనులను పూర్తిచేసుకోవాలని సూచించారు. సేవలు నిలిపివేతపై ఇప్పటికే అన్ని కేంద్రాలకు సమాచారం అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ మార్పులతో భవిష్యత్తులో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News