Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:31 AM

తెలంగాణకు మొండి చేయి

తెలంగాణకు మొండి చేయి

తెలంగాణకు మొండి చేయి
02-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సామాన్యునికి అందని ద్రాక్షగా కేంద్ర బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండి చేయి చూపించడమే కాక సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారిందని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ తీవ్రంగా విమర్శించారు.

ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌పై ఈ రోజు సూర్యాపేటలోని విక్రమ్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు.ఈ బడ్జెట్ పూర్తిగా సామాన్యులు, పేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేయడమే కాక, కింది స్థాయి ప్రజలకు విద్య, వైద్యం అందని దూరంలోకి వెళ్లిపోయిందని, కార్పొరేట్ విద్యా వైద్యానికి పెద్దపీట వేశారని ఆరోపించారు.

ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించి తెలంగాణకు తగిన బడ్జెట్ కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. మూడు హైస్పీడు రైళ్ల వంటి వాటిని చూపించి చేతులు దులుపుకోవడం సరికాదని పేర్కొన్నారు.ఈ బడ్జెట్ మేడిపండు లాంటిదే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా గానీ, పేదరిక నిర్మూలనకు ఉపయోగపడే విధంగా గానీ లేదని అన్నారు. బడ్జెట్‌ను బిజెపి వారు తప్ప మిగతా అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.ఇకనైనా కేంద్ర ప్రభుత్వం సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు బతికేలా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా బడ్జెట్‌ను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నరసన్న, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సురం రేణుక, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు భీమనపల్లి ప్రకాష్ పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణకు మొండి చేయి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News