Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:27 AM

తెలంగాణ–కర్ణాటకకు మెరుగైన రవాణా న్యాల్కల్ మండలంలో వేగంగా సాగుతున్న ఎన్హెచ్-50 పనులు

12-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

న్యాల్కల్ మండల పరిధిలోని డప్పూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు వెళ్లే ఈ రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి–50 (NH-50)గా అభివృద్ధి చేస్తోంది. ఈ రహదారి విస్తరణ పనులు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతున్నాయి.రంగారెడ్డి జిల్లా నిజాంపేట్ నుంచి ప్రారంభమై నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు వెళ్లే ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని జాతీయ రహదారుల రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డి వెల్లడించారు.సుమారు ₹512 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రెండు లేన్లుగా, పేవ్డ్ షోల్డర్లతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2021–22 వార్షిక ప్రణాళికలో చేర్చి EPC విధానంలో పనులు చేపట్టారు.ఈ రహదారి అభివృద్ధి పూర్తయితే తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నారాయణఖేడ్, న్యాల్కల్ మండలాల ప్రజలకు ఈ రహదారి ద్వారా ప్రయాణం సులభం కానుంది.ఇదిలా ఉండగా న్యాల్కల్ మండలంలోని డప్పూర్ గ్రామ శివారులో రహదారి విస్తరణ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.అయితే నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు రావడంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

తెలంగాణ–కర్ణాటకకు మెరుగైన రవాణా న్యాల్కల్ మండలంలో వేగంగా సాగుతున్న ఎన్హెచ్-50 పనులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News