Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:29 PM

తెలంగాణ రాజ్యాధికారం పార్టీ కార్యాలయం ప్రారంభం

తెలంగాణ రాజ్యాధికారం పార్టీ కార్యాలయం ప్రారంభం

తెలంగాణ రాజ్యాధికారం పార్టీ కార్యాలయం ప్రారంభం
January 27, 2026 06:13 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గజ్వేల్ లో రానున్న మున్సిపల్ ఎన్నికల బరిలో టిఆర్పి

-బహుజనులకు రాజ్యాధికారమే ముఖ్య ఉద్దేశం

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తుప్పతి బిక్షపతి, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పి నర్సింగ్ ల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని స్థాపించడం జరిగిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమై బహుజనులకు అధికారం దిశగా ముందుకు సాగాలని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ లోని పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీకి సిద్ధంగా ఉంది అని తెలియజేస్తూ మున్సిపల్ లోని ప్రజలకు తెలియజేయ విషయం ఇప్పటివరకు వేరే పార్టీలో బీఫాంలో కోసం ఎదురుచూసే పరిస్థితి లేదని, రానున్న మున్సిపల్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ బాబా, జిల్లా యూత్ ప్రెసిడెంట్ కిషన్, జిల్లా సహాయ కార్యదర్శి గాలింక స్వామి, మహిళా అధ్యక్షురాలు తుప్పతీ శ్వేత, ఉపాధ్యక్షురాలు మౌనిక, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం వెంకటేష్, సిద్దిపేట జిల్లా రైతు సమితి అధ్యక్షులు రమేష్, సోషల్ మీడియా సిద్దిపేట జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్, రాయపోల్ మండల అధ్యక్షులు తుప్పతీ కనకయ్య, మర్కుక్ మండల అధ్యక్షులు అనిల్, జగదేవ్ పూర్ మండల అధ్యక్షులు గడ్డం సురేందర్, తూప్రాన్ మండల అధ్యక్షులు గణేష్, ములుగు మండల అధ్యక్షులు ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శి ప్రకాష్, రాజు, భాస్కర్, బిక్కు నరేష్, శ్రీకాంత్, నాగరాజు, శ్రీనివాస్, జగదేవ్ పూర్ మండల్ ప్రధాన కార్యదర్శి హరీష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News