Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:28 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల వెల్లువ

30-01-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. సూర్యాపేట పట్టణం ముప్పై నాలుగో వార్డుకు చెందిన కాంటేకార్ రఘుమోహన్, షేక్ జానిభాష, విజయ్ మోహన్, శ్రావణి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.అనంతరం వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆశల పార్టీ అని అన్నారు. గత డెబ్బై నుంచి ఎనభై ఏళ్ల పాలనలో బహుజన వర్గాలకు తగిన న్యాయం జరగలేదని విమర్శించారు. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.రాబోయే రోజుల్లో చేరికలు మరింత వేగం పెరుగుతాయని, ప్రజల మద్దతుతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పార్టీ నాయకుడు కుంభం వెంకన్నతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల వెల్లువ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News