Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల & కళాశాలలో (ఆర్మూర్ )నూతన ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

21-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ :ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో(టీజీఎంఆర్ఎస్ & జెసి)2026 విద్యాసంవత్సరానికి గాను నూతన ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ నహిదా ఫిర్దోసే తెలిపారు.ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ఎంపీసీ, బైపీసీ మరియు గ్రూప్స్ కోర్సులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన ప్రవేశాల కరపత్రాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నాయకులు వినయ్ రెడ్డిని కలిసి ప్రవేశాల వివరాలపై చర్చించారు.గత విద్యాసంవత్సరంలో పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్‌లో 98 శాతం ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపల్ తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయిలో 3వ, 12వ ర్యాంకులు సాధించడం కళాశాల ప్రతిభకు నిదర్శనమన్నారు.విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన, పోషకాహారాన్ని కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హత గల మైనారిటీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థినులు మామిడిపల్లిలోని తిరుమల కాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను సంప్రదించి దరఖాస్తులుఅందజేయవచ్చని తెలిపారు.మరిన్ని వివరాల కోసం 79950 37941నెంబర్‌నుసంప్రదించవచ్చనిఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని వెల్లడించారు.

Sthanikam

తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల & కళాశాలలో (ఆర్మూర్ )నూతన ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News