Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:08 PM

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే

23-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, అక్రమంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై ఏర్పాటు చేసిన విచారణకు ఆయన ధైర్యంగా హాజరై తెలంగాణ భవన్‌కు విచ్చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ గారిపై ఈ విధమైన విచారణలు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.ఈ విచారణకు కేటీఆర్ ఎలాంటి భయాందోళనలకూ లోనుకాకుండా,సింహంలా తెలంగాణ భవన్‌కు వచ్చి విచారణకు హాజరుకావడం ఆయన ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనం. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్న నాయకుడిగా ఆయన మరోసారి తన స్థాయిని చాటుకున్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ కి పూర్తి మద్దతుగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తెలంగాణ భవన్‌కు చేరుకొని,కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే నాయకులందరికీ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి తెలిపారు.

Sthanikam

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News