Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి కలం బలం.. 25 ఏళ్ల తెలంగాణ జర్నలిస్టు ఫోరం సేవలకు ఘన నివాళి

01-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్లగొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌లో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు జర్నలిస్టులు నివాళులర్పించి, ఉద్యమంలో మీడియా పోషించిన పాత్రను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో మాట్లాడిన టీజేఎఫ్ రాష్ట్ర నాయకుడు గుండగోని జయశంకర్ మాట్లాడుతూ, 2001 మే 31న కేవలం పది మంది జర్నలిస్టులతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ప్రారంభమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలం యోధులుగా జర్నలిస్టులు పోరాడారని, ఉద్యమ స్వరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీజేఎఫ్ కీలక భూమిక పోషించిందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ చరిత్రలో జర్నలిస్టుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి దశలో టీజేఎఫ్ ముందుండి ఉద్యమానికి మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. రజతోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి యువ జర్నలిస్టులకు ఉద్యమ స్ఫూర్తిని చాటుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–143 జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, జిల్లా నాయకులు ఫహిమొద్దీన్, జనార్ధన్ రెడ్డి, దీకొండ రవిశంకర్, పిల్లలమర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి జానయ్య, నల్లగొండ డివిజన్ యూనియన్ నాయకులు ఓడపల్లి మధు ముదిరాజ్, నీలం వెంకట మధు, దండంపల్లి రవికుమార్ గౌడ్, జానీ, శివ, హరి హాజరయ్యారు.వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లి మల్లికార్జున్, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు కంది వేణు, కార్యదర్శులు ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్, చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు మీసాల నరహరి, నవీన్, సైదులు పాల్గొన్నారు. పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి కలం బలం.. 25 ఏళ్ల తెలంగాణ జర్నలిస్టు ఫోరం సేవలకు ఘన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News