టిఆర్ఎస్ నాయకుల నిరసన
సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని టేకుమట్ల సమీపంలో జాతీయ రహదారి అరవై ఐదు పై టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. రాస్తారోకో కారణంగా కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నిరసన అనంతరం నాయకులు శాంతియుతంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి