Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:55 AM

టీబీ నిర్మూలనకు సంగారెడ్డి ముందడుగు: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

టీబీ నిర్మూలనకు సంగారెడ్డి ముందడుగు: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

టీబీ నిర్మూలనకు సంగారెడ్డి ముందడుగు: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
March 24, 2026 04:33 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

టీబీ రహిత జిల్లానే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించి, 100 రోజుల “టీబీ ముక్త్ భారత్ అభియాన్ v2.0” కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీబీ పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని,ప్రజల్లో అవగాహన పెంచితే దీన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమని చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీబీ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాయని తెలిపారు.జిల్లాలో మే 15 వరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, అధిక కేసులు ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికీ సర్వేలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.14 సంవత్సరాల పైబడినవారితో పాటు గర్భిణీలు,రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ,మొబైల్ ఎక్స్-రే వాహనాల ద్వారా వెంటనే ఫలితాలు అందజేస్తున్నారు. అవసరమైన వారికి ఉచిత చికిత్స, మందులు అందిస్తున్నామని తెలిపారు.టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి పూర్తి చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ ర్యాలీలో విద్యార్థులు,ఆరోగ్య సిబ్బంది,ఆశా వర్కర్లు పాల్గొని నినాదాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు.పోలీసులు, అధికారులు,ప్రజలు కలిసి పనిచేస్తేనే టీబీ రహిత సమాజం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News