Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:00 AM

టీఆర్‌పీలో భారీ చేరికలు యువతకు రాజకీయ

టీఆర్‌పీలో భారీ చేరికలు యువతకు రాజకీయ

టీఆర్‌పీలో భారీ చేరికలు  యువతకు రాజకీయ
23-05-2026 189 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అవకాశాలే పార్టీ లక్ష్యం : వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) బలోపేతానికి యువత ముందుకు వస్తూ పార్టీకి విశేష మద్దతు తెలుపుతున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమక్షంలో జిల్లా టీఆర్‌పీ యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణలో బహుజన వర్గాల అభివృద్ధి, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడమే టీఆర్‌పీ లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.

జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడానికి యువతతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది యువతను పార్టీ వైపు తీసుకువచ్చి ప్రతి గ్రామంలో టీఆర్‌పీ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ, వట్టే జానయ్య యాదవ్ నాయకత్వం, పార్టీ సిద్ధాంతాలు తమను ఆకట్టుకున్నాయని, ప్రజా సమస్యలపై పోరాడే టీఆర్‌పీతో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నే మంజుల గౌడ్, టీఆర్‌పీ టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు(ఎస్) మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి, వల్లాల సైదులు యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు సైదులు, బోడపట్ల మధు, లింగాల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టీఆర్‌పీలో భారీ చేరికలు యువతకు రాజకీయ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News