Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

19-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.39/2026 U/s 303(2) BNS కేసులో ట్రాన్స్‌ఫార్మర్‌లలోని కాపర్ వైర్ల దొంగతనాలకు పాల్పడిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 12/13-02-2026 మధ్య రాత్రి దెందులూరు మండలంలోని అప్పారావుపాలెం, గాలాయగూడెం గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించబడినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన వారిలో గోడ కార్తీక్ (23), వేల్పుల మణికంఠ @ పిట్ల (ఇతనిపై గతంలో సుమారు 40 కేసులు నమోదైనట్లు సమాచారం), వేల్పుల విష్ణు మోహన్ @ చిన్ని, కోసూరి మురళి, తమటం జాన్ మలాకి, వలముల వెంకట కోటేశ్వరరావు @ కోటి (స్క్రాబ్ వ్యాపారి) ఉన్నారు.

దర్యాప్తులో నిందితులు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కలిపి మొత్తం 47 ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో కేసుల లింకేజీ ప్రక్రియ కొనసాగుతోంది.

నిందితుల వద్ద నుంచి దొంగిలించిన కాపర్ కాయిల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థాన కస్టడీకి పంపారు.

Sthanikam

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

Article Image

దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.39/2026 U/s 303(2) BNS కేసులో ట్రాన్స్‌ఫార్మర్‌లలోని కాపర్ వైర్ల దొంగతనాలకు పాల్పడిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 12/13-02-2026 మధ్య రాత్రి దెందులూరు మండలంలోని అప్పారావుపాలెం, గాలాయగూడెం గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించబడినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన వారిలో గోడ కార్తీక్ (23), వేల్పుల మణికంఠ @ పిట్ల (ఇతనిపై గతంలో సుమారు 40 కేసులు నమోదైనట్లు సమాచారం), వేల్పుల విష్ణు మోహన్ @ చిన్ని, కోసూరి మురళి, తమటం జాన్ మలాకి, వలముల వెంకట కోటేశ్వరరావు @ కోటి (స్క్రాబ్ వ్యాపారి) ఉన్నారు.

దర్యాప్తులో నిందితులు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కలిపి మొత్తం 47 ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో కేసుల లింకేజీ ప్రక్రియ కొనసాగుతోంది.

నిందితుల వద్ద నుంచి దొంగిలించిన కాపర్ కాయిల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థాన కస్టడీకి పంపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News