Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:43 AM

ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు – 55 కేసులు ఛేదించిన తిరుపతి పోలీసులు

19-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరుపతి,

వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని రాగి వైర్లను దొంగిలిస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న అంతర్‌జిల్లా ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కలిపి 195 ట్రాన్స్‌ఫార్మర్లలో దొంగతనాలు చేసిన ఈ ముఠా సభ్యులను పట్టుకుని మొత్తం 55 కేసులను ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముఠా వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన 400 కిలోల రాగి వైర్లు, నేరాలకు ఉపయోగించిన రెండు ఆటోలు, రెండు మోటార్ సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంగా ఎక్కడా అరెస్ట్ కాకుండా చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ తిరుగుతున్న ఈ గ్యాంగ్‌ను ప్రత్యేక బృందాలు పక్కా ప్రణాళికతో పట్టుకున్నాయి.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో, నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. బాలయ్యపల్లి మండలం జయంపు క్రాస్‌రోడ్డు వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా ఐదుగురు దొంగలు పట్టుబడ్డారు. వారి వద్ద దొంగతనాలకు ఉపయోగించిన పరికరాలు, రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా, ఈ ముఠా తిరుపతి జిల్లాలో 45 కేసులు, నెల్లూరు జిల్లాలో 10 కేసులు చేసినట్లు అంగీకరించింది. అదేవిధంగా దొంగ సొత్తును కొనుగోలు చేసిన మనుబోలు మండలానికి చెందిన చల్లా రాఘవను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

కేవలం రూ.15 నుండి 20 వేల విలువైన రాగి వైర్ కోసం సుమారు రూ.2.5 లక్షల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒకవైపు పంట నష్టం, మరోవైపు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల అమరికలో ఆలస్యం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

అరెస్ట్ అయిన ముద్దాయిలపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో దొంగ సొత్తు కొనుగోలు చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి, సిబ్బందికి రివార్డులు అందజేశారు.

Sthanikam

ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు – 55 కేసులు ఛేదించిన తిరుపతి పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News