Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 11:41 AM

సూర్యాపేటలో రహదారి భద్రత వారోత్సవాలు

సూర్యాపేటలో రహదారి భద్రత వారోత్సవాలు

సూర్యాపేటలో రహదారి భద్రత వారోత్సవాలు
23-02-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రమాదాల నివారణలో విద్యార్థులే దూతలు కావాలి : అదనపు ఎస్పీ

సూర్యాపేట: రహదారి ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరేలా చేయడం లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ ఆలైవ్” రహదారి భద్రత అవగాహన వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక సాయి గౌతమి కళాశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి హాజరై విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదం సంభవించడం అంటే ఒక కుటుంబం రోడ్డుపాలవడమేనని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు అవగాహన, ముందస్తు జాగ్రత్తలే ప్రధాన మార్గమని తెలిపారు. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రహదారి భద్రత విషయంలో విద్యార్థులు దూతలుగా మారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రజలు, పెద్దలు, నిరక్షరాస్యులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. చిన్నపిల్లలు వాహనాలు నడపకూడదని, పెద్దలు తప్పనిసరిగా తలరక్షక కవచం ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ప్రమాదాల నిర్మూలనకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, రెండవ పట్టణ ఎస్సై శివతేజ, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో రహదారి భద్రత వారోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News