సూర్యాపేట జిల్లా కేంద్రానికి విచ్చేసిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి కు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముందుండి స్వాగత ఏర్పాట్లు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పాల్గొని శాసనసభ్యురాలిని సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి