Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:27 AM

సూర్యాపేటలో దారుణం.. ప్రియురాలిపై సుత్తితో దాడి

19-02-2026 446 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట పట్టణంలో ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారి తీసిన ఘటన కలకలం రేపింది. ప్రియురాలు దూరం పెడుతోందన్న అనుమానంతో గురువారం ఓ యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహనగర్‌లో నివాసం ఉంటున్న యువతి ఇంట్లోకి వెళ్లిన నిందితుడు ఆమె తలపై సుత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. దాడి అనంతరం పారిపోడానికి ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకుని స్థంభానికి కట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. యువతి, యువకుడు ఇద్దరూ సమీప గ్రామాలకు చెందినవారని, గత ఎనిమిదేళ్లుగా పరిచయం ఉన్నట్లు సమాచారం. ఇటీవల కొంతకాలంగా యువతి సూర్యాపేటలో ఒంటరిగా నివాసం ఉంటున్నట్టు తెలిసింది. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Sthanikam

సూర్యాపేటలో దారుణం.. ప్రియురాలిపై సుత్తితో దాడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News