Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:32 AM

సూర్యాపేటలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా

19-02-2026 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహారాష్ట్ర గర్వకారణుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం నుండి ఛత్రపతి శివాజీ విగ్రహంతో భక్తి గీతాలు, నృత్యాలతో భారీ ఊరేగింపును నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీ కోర్టు చౌరస్తా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నాయకులు శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శివాజీ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో ఐక్యత, స్ఫూర్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కారింగుల ఉపేందర్ గౌడ్, పున్నం సందీప్, కాసర్ల శ్రీకాంత్, దినేష్ బాబు, విజయ్ కృష్ణ, చంద్రశేఖర్, చల్లమల్ల నరసింహ, శివ తదితరులు పాల్గొన్నారు. జయంతి వేడుకల సందర్భంగా శివాజీ మహారాజ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

Sthanikam

సూర్యాపేటలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News