Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:47 AM

సూర్యాపేటలో అభివృద్ధి యజ్ఞం ప్రారంభం

సూర్యాపేటలో అభివృద్ధి యజ్ఞం ప్రారంభం

సూర్యాపేటలో అభివృద్ధి యజ్ఞం ప్రారంభం
23-02-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

50 లక్షలతో నాలా కల్వర్టు, సిమెంట్ రహదారులకు శంకుస్థాపన

సూర్యాపేట పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిధులకు వెనుకడకుండా, నాణ్యతలో రాజీపడకుండా పనులు చేపడుతున్నామని ప్రజాప్రతినిధులు తెలిపారు. అందరి భాగస్వామ్యంతో భవిష్యత్తు తరాలకు అందమైన పట్టణాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని అరవై అడుగుల రహదారిలో నాలా కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నలభై ఆరు, నలభై ఏడు వార్డుల్లో మొత్తం యాభై లక్షల రూపాయల వ్యయంతో నాలా కల్వర్టు, సిమెంట్ రహదారి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వర్టు లేకపోవడంతో ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు మరియు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరితగతిన భూగర్భ మురుగు కాలువల నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. పారిశుద్ధ్య పనులు ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రిని కలసి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు తెలిపారు. మంత్రులు ఉత్తమన్న, లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతోందన్నారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వెనుక వీధిలో, సీపీఎం పార్టీ కార్యాలయం వెనుక వీధిలో సిమెంట్ రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ముఖ్యులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో అభివృద్ధి యజ్ఞం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News