Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం
07-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

(శ్రీ సత్యసాయి జిల్లా) సోమందేపల్లి: ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ‘ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన’ పథకం దోహదం చేస్తుందని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని, నియోజకవర్గంలో 2514 మందికి, మండలంలో 600 మందికి సోలార్ ప్యానెల్లు అందజేయనున్నట్లు తెలిపారు. మిగులు విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.

అధికారులు పథకం ప్రయోజనాలు పూర్తిగా చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం

Article Image

(శ్రీ సత్యసాయి జిల్లా) సోమందేపల్లి: ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ‘ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన’ పథకం దోహదం చేస్తుందని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని, నియోజకవర్గంలో 2514 మందికి, మండలంలో 600 మందికి సోలార్ ప్యానెల్లు అందజేయనున్నట్లు తెలిపారు. మిగులు విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.

అధికారులు పథకం ప్రయోజనాలు పూర్తిగా చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News