Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

సురక్షిత గాలిపటాలే సంతోషానికి మార్గం:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

11-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు వారం రోజుల సెలవులు రావడంతో, ఎక్కువ మంది పిల్లలు గాలిపటాలు ఎగురేయడానికి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మరియు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కంగ్టి పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం.ప్రస్తుతం చైనా మంజా పూర్తిగా నిషేధించబడింది. దీనివల్ల పక్షులకు తీవ్ర గాయాలు కలగడమే కాకుండా, మనుషులకు కూడా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా మంజాను ఉపయోగించరాదని ప్రజలకు సూచిస్తున్నాం.పిల్లలు బహుళ అంతస్తుల భవనాల పైన గాలిపటాలు ఎగురేస్తున్న సమయంలో కిందకు చూడకుండా పడిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే భవనాల సమీపంలో ఉన్న విద్యుత్ తీగలపై గాలిపటాలు చిక్కుకున్నప్పుడు, వాటిని తీసేందుకు ప్రయత్నించడం వల్ల విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది. గతంలో మన నారాయణఖేడ్ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగినట్లు గుర్తు చేస్తున్నాం.అదేవిధంగా, పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధం. అలా ఇచ్చిన సందర్భాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే, సంబంధిత తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం కన్నేసి ఉంచి, వారు ప్రమాదకరమైన పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగను సురక్షితంగా మరియు ఆనందంగా జరుపుకోవాలని కంగ్టి పోలీస్ శాఖ తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నాం.

Sthanikam

సురక్షిత గాలిపటాలే సంతోషానికి మార్గం:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News