Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:44 AM

సుంకేనపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం – రూ.10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

17-03-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని సుంకేనపల్లి గ్రామంలో మంగళవారం అభివృద్ధి పనుల సందడి నెలకొంది. ఉపాధి హామీ పథకం (NRGS ) నిధులతో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య యాదవ్ ఘనంగా భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఈ అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులు ఈ సీసీ రోడ్డుతో తొలగిపోతాయని, రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని వివరించారు.రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తూ సుంకేనపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యురాలు ఆవుల సోనీతో పాటు మచ్చ గిరి, నాగవచారి, లింగస్వామి, లింగం తదితరులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సుంకేనపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం – రూ.10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని సుంకేనపల్లి గ్రామంలో మంగళవారం అభివృద్ధి పనుల సందడి నెలకొంది. ఉపాధి హామీ పథకం (NRGS ) నిధులతో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య యాదవ్ ఘనంగా భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఈ అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులు ఈ సీసీ రోడ్డుతో తొలగిపోతాయని, రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని వివరించారు.రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తూ సుంకేనపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యురాలు ఆవుల సోనీతో పాటు మచ్చ గిరి, నాగవచారి, లింగస్వామి, లింగం తదితరులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News