Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

సుందరయ్య ఆశయాలను సాధిస్తాం: సీపీఎం

సుందరయ్య ఆశయాలను సాధిస్తాం: సీపీఎం

సుందరయ్య ఆశయాలను సాధిస్తాం: సీపీఎం
19-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఘనంగా ‘కమ్యూనిస్టు గాంధీ’ 41వ వర్ధంతి

భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు, ‘కమ్యూనిస్టు గాంధీ’గా ప్రసిద్ధి చెందిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల కమిటీల ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సుందరయ్య జీవితం పీడిత ప్రజల విముక్తికి, సామ్యవాద స్థాపనకు అంకితమైందని కొనియాడారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయనే పునాది వేశారని గుర్తుచేశారు. భూ పోరాటాలు, వ్యవసాయ కార్మికుల ఐక్యత, అంటరానితనంపై పోరాటంలో సుందరయ్య పాత్ర అజరామరమని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, సాయుధ దళాలకు ఆయనే స్వయంగా నాయకత్వం వహించారని స్పష్టం చేశారు.​"నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, పేదల సమస్యలపై చట్టసభలలో గళమెత్తిన గొప్ప ప్రజా నాయకుడు సుందరయ్య. ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆశయాల సాధన కోసం సీపీఎం నిరంతరం పనిచేస్తుంది."​ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ. పాషా, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, నాయకులు బత్తుల దాసు, బొడ్డు అంజిరెడ్డి, సప్పిడి శ్రీనివాసరెడ్డి, భావనలపల్లి స్వామి, రమేష్, ఆకుల ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సుందరయ్య ఆశయాలను సాధిస్తాం: సీపీఎం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News