Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:29 AM

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు

12-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో పరువునష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం భువనగిరి పట్టణ సీఐ రమేష్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మహాసభ జిల్లా అధ్యక్షుడు కొలుపుల హరినాథ్‌, ప్రధాన కార్యదర్శి సాదు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూలు జిల్లా కోనేటిపూర్‌కు చెందిన నూకం జాన్ ముదిరాజ్‌, వనపర్తి జిల్లా మనుగిల్ల గ్రామానికి చెందిన వై.శివ ముదిరాజ్‌, అల్లదుర్గం సురేష్‌లు సోషల్‌మీడియా వేదికగా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌, మంత్రి వాకిటి శ్రీహరిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

వీరితో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలతో కూడిన కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నూకం జాన్ అలియాస్‌ నాని ‘జనతా న్యూస్‌ ఆప్‌’, ‘ముదిరాజ్‌ హిస్టరీ టీవీ’ సీఈఓగా వ్యవహరిస్తూ ముదిరాజ్‌ కమ్యూనిటీ నాయకులపై అవమానకర భాష ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు.

ఇతనిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంట నర్సింహా, కన్వీనర్‌ ఉడుత భాస్కర్‌, జిల్లా నాయకులు పిట్టల బాలరాజు, కనక బాలరాజు, బోయిని బాలయ్య, పిట్టల రాములు, ఇట్టబోయిన గోపాల్‌, ఎనబోయిన జహంగీర్‌, గీస కొండల్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News